హైదరాబాద్, జూలై 27: మాదాపూర్‌లోని దుర్గంచెరువులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ (25) మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. బుధవారం ఆఫీసుకు వెళ్లిన బాలాజీ అర్ధరాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ సైతం స్విచ్చాఫ్ చేసి ఉండడంతో స్నేహితులను విచారించారు. అయినా, ఫలితం లేకపోవడంతో ఈ నెల 25న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా.. ఈ నెల 24న రాత్రి 8:30 గంటలకు బాలాజీ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో దుర్గంచెరువు కేబుల్ మీదుగా కిందకి దిగినట్లు కనిపించడంతో గాలించారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం దుర్గంచెరువులో బాలాజీ మృతదేహం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా మృతున్ని గుర్తించారు. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తోన్న బాలాజీ.. ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేయగా.. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక బాలాజీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన రాయదుర్గం పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Related Articles
హైడ్రా నోటీసులతో బిజీ…
హైడ్రా స్పీడ్ తగ్గిందా? లేక తెర వెనుక పని చేసుకుంటూ పోతోంద…
బీజేపీకి దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ వ్యూహం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ హిందు…
భువనగిరిలో ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం భువనగిరి సభలో సీఎం కెసిఆర్
యదాద్రి భువనగిరి అక్టోబర్ 16 ‘యాదాద్రి లక్ష్మీనరసి…