తెలంగాణ

జిల్లా ప్రధాన ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో .600 పడకలు మజురు అయి ప్రస్తుతం 450 పడకలు మాత్రమే ఉన్నాయని ఇప్పుడు  600 ల పడకల ఆసుపత్రి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి తుమ్మల డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించారు. ఆసుపత్రిలో ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉందని, ఆసుపత్రిని ప్రతి రోజూ శుభ్రం చేయాలన్నారు. డాక్టర్లు అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మెలగాలన్నారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించేందుకు ఇప్పటికే ఔట్ సోర్సింగ్ కలెక్టర్ ప్రకటన విడుదల చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో మందుల కొరత రైతుల అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కలెక్టర్కు పలు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందే వైద్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. విషయాలను డాక్టర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మాత శిశు కేంద్రం ఎదురుగా డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగు బయటకు రావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే పనులు చేయాలని మున్సిపల్ కమిషనరు ఆదేశించారు. వారంలో ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్లకు ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ లో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆదివారం ఉండరా అని అడిగారు, సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నారని వైద్యులు సమాధానం ఇచ్చారు. మంత్రి ఆకస్మిక తనిఖీలల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ ,ఆసుపత్రి పాల్గొన్నారు.