ఆంధ్రప్రదేశ్

శుభదిన్ భోజనం కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే

కాకినాడ: వ్యాయామంతో పాటు మంచి విద్యను అభ్యసించి, ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్ధినీవిద్యార్థులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెద్దాపురపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన శుభ  దిన్ భోజనం కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ముందుగా సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలవేసి  అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి  సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ  ఈ హైస్కూల్ అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ విద్యార్థులగా  వెలగాలని కోరారు.  అనంతరం పదో తరగతి పరీక్ష ఫలితాలో  మంచి ప్రగతిని , ఇటీవల ఐఐఐటీలో సీటు సాధించిన  ఆరుగురు విద్యార్థులకు  దాతల అందించిన ఆర్థిక సహాయాన్ని అందించారు.  అనంతరం విద్యార్థులతో కలిసి  డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులతో పాటు మండల జనసేన పార్టీ అధ్యక్షులు  బండారు మురళి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి  అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.