అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

Tokyo Olympics: డిఫెండింగ్‌ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్‌

ఒలింపిక్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ను భారత హాకీ జట్టు మట్టికరిపించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాపై భారత హాకీ జట్టు జయకేతనం ఎగురవేసింది. గురువారం ఉదయం జరిగిన గ్రూప్‌-ఏ నాలుగో మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించింది. మ్యాచ్‌ తొలి క్వార్టర్ ముగిసేసరికి 0-0తో ఇరుజట్లు ఖాతా తెరవలేదు. అయితే మ్యాచ్‌ 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్‌ వరుణ్‌ తొలి గోల్‌ చేసి జట్టును 1-0తో లీడ్‌లో నిలిపాడు. అయితే కొద్ది సేపట్లోనే (మ్యాచ్‌ 48వ నిమిషంలో) అర్జెంటీనా ఆటగాడు మైకో కసెల్లా తన జట్టుకు తొలి గోల్‌ అందించాడు. దీంతో ఇరుజట్ల స్కోర్‌ సమం అయ్యింది. కాగా, మ్యాచ్‌ 58వ నిమిషంలో ప్రసాద్‌ వివేక్‌ సాగర్‌ రెండో గోల్‌ చేయడంతో ఇండియన్‌ టీం లీడ్‌లోకి దూసుకెళ్లింది. ఇక 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడో గోల్ చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. నాలుగో క్వార్టర్‌లోనే భారత్‌ రెండు పాయింట్లు సాధించడం విశేషం.