కర్నూలు, ఆగస్టు 2: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలు వరదలో మునిగిపోయాయి. రహదారులు జలమయం అయ్యాయి. చెట్లు, పుట్టలు కొట్టుకుపోతున్నాయి. పలుచోట్ల ఇళ్లు కూడా కూలిపోతున్నాయి. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంటి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన స్ధానికంగా తీవ్ర విషాదం నింపింది.జిల్లాలోని చాగలమర్రి మండల పరిధిలోని చిన్న వంగలి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురు శేఖర్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు పిల్లలు రాత్రి భోజనాలైన తర్వాత అంతా నిద్రపోయారు. వారిది మట్టి ఇల్లు కావడంతో అర్థరాత్రి మట్టి మిద్దె కూలిపోయి నలుగురూ మృతి చెందారు. గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మిద్దె కూలి వారిపై పడటంతో ఆ మట్టి కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఉదయం చుట్టుపక్కలవారు వచ్చి చూసి షాకయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీశారు. నలుగురు కుటుంబ సభ్యులూ అలా ప్రాణాలు కోల్పోవడం చూపరులను కంటతడి పెట్టించింది. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. కేసు నమోదు చేశారు.
Related Articles
వచ్చే నెల 30 నుంచి ఇంజినీరింగ్ తొలి ఏడాది తరగతులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో మొదటి ఏడాది విద్యార్థులకు వచ్చే నెల 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. మిగతా తరగతుల విద్యార్థులకు ఈ నెల 1 నుంచే తరగతులు మొదలయ్యాయి. కాగా, సవరించిన షెడ్యూల్ ప్రకారం […]
దేశంలో 12-17 ఏళ్ల లోపు వారికి కోవోవాక్స్ టీకా !
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కోవోవాక్స్ కు ఎన్టాగీ అనుమతి దేశంలో 12-17 ఏళ్ల లోపు వారికి కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ తీసుకొచ్చిన కోవోవాక్స్ టీకాకు అనుమతి లభించింది. ఎన్టాగీ కోవోవాక్స్ ను కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాగా, కొవిడ్ టీకా రెండో డోసు, ప్రికాషన్ […]
Fire accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం..!
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) చోటుచేసుకుంది. బొరివాలీ ఏరియాలో ఓ బహుళ అంతస్తుల భవనంలోని ఏడో ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక […]