ఆంధ్రప్రదేశ్

అన్నవరం లోదొంగలు బీభత్సం...

అన్నవరం: అన్నవరం గ్రామంలో దర్జాగా దొంగలు వీరవిహారం చేస్తు, ఇల్లులు గుల్ల చేయడంతో పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్సై  కిషోర్   స్పందించి అన్నవరం, కత్తిపూడి రోడ్డు, పురవీధులలో ప్రత్యేక నిఘా పెట్టారు. తెల్లవారుజాము వరకు సైరన్ మోగిస్తూ  పోలీస్ వాహనం పై తిరగాలని, రోడ్డు,  వీధులలో అర్ధరాత్రిలు వరకు తాగి గొడవలకు కారణమైన వారిని,  అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తులను,, నెంబర్ బోర్డ్స్ లేని ద్విచక్ర వాహనాలు,, తక్షణమే పోలీస్ స్టేషన్ కు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.
పోలీసుల నైట్ బీట్ లో భాగంగా సుమారు  రాత్రి 11 గంటల సమయంలో సత్యనారాయణ స్వామివారి గుడి మెట్లు వద్ద సుమారు నాలుగు ద్విచక్ర వాహనాలు పై అనుమానస్పదంగా యువకులు సంచరించడంతో అటుగా వెళుతున్న ఎస్సై  కిషోర్ గ యువకులని ప్రశ్నించారు.   పొంతనలేని సమాధానం రావడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.