నంద్యాల: నంద్యాలలో సంచలనం రేపిన రౌడీ షీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయ్యలూరి మెట్ట శివారులోని వెంచర్లో రౌడీ షీటర్ వెంకట సాయి @ కవ్వ హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలించారు.
వారి నుంచి రెండు సెల్ ఫోన్లు,ఒక ఇన్నోవా,ఒక మోటార్ సైకిల్,నాల్గు కత్తులు మరియు రెండు ఇనుప రాడ్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నంద్యాల డీఎస్పీ మాట్లాడుతూ చనిపోయిన రౌడీ షీటర్ వెంకట సాయి @ కవ్వాపై అనేక మర్డర్ కేసులు,అటెంప్ట్ మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నట్లు మీడియాకు తెలిపారు.అంతేకాకుండా కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో హతుడు (కవ్వ) ఏ1 ముద్దాయిగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.విచారణలో అరెస్ట్ కాబడిన ముద్దయి సంజీవకు,హతుడు కవ్వాకు ఆర్థిక పరమైన మనస్పర్ధలు అదేవిధంగా గతంలో రౌడీ షీటర్ రాజ్ శేఖర్ హత్య విషయంలో మరియు నంద్యాల పట్టణంలో ఆధిపత్య విషయంలో ఈ హత్య చేయడం జరిగిందని,అలాగే అరెస్ట్ కాబడిన వారిలో నలుగురిపై రౌడీ షీట్ ఉన్నట్లు డీఎస్పీ రవీంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.హత్య కేసు నిందితులను సవాలుగా తీసుకొని ఛేదించిన తాలూకా సీఐ దస్తగిరి బాబు,ఎస్ఐ నాగరాజులను డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి అభినందించారు..