ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

పెనమలూరు: ఉయ్యూరులో ఈనెల 15వ తేదీన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా సంబంధిత ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా బోడో ప్రసాద్ మాట్లాడుతూ పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది అని  అన్నారు. ముందుగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు.  అందులో భాగంగా మొదటి అన్న క్యాంటీన్ ఉయ్యూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదగా ప్రారంభించడం సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజు, మున్సిపల్ కమిషనర్ వల్లభనేని సత్యనారాయణ కౌన్సిలర్లు పాల్గొన్నారు