ఆంధ్రప్రదేశ్

పేదల బియ్యాన్ని బొక్కేయడం దారుణంమంత్రి నాదెండ్ల మనోహర్

కాకినాడ: గత జూన్ 28, 29, తేదీల్లో  చేసిన  తనిఖీ ల్లో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం దొరికింది. దాంట్లో సుమారు 26, వేల మెట్రిక్ టన్నులు బియ్యం కేవలం పి డి యస్ బియ్యం ఉండటం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు.  గత ప్రభుత్వం అధికారం లో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో సంబంధించిన అధికారులను కాని మీడియా ను కానీ ఆ చుట్టుపక్కల  రానివ్వకుండా కట్టడి చేయడం చాలా విచారకరం అని అన్నారు. పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే బియ్యం ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కనుసైగలతో పేదల బియ్యం బొక్కేయడం దారుణం. ఎవరి మీద వ్యక్తిగతంగా కాకుండా తప్పు చేసిన వారిని వదలకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పోర్టు లో ప్రస్తుతం చెక్ పోస్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ప్రారంభంలో కొన్ని ట్రాఫిక్ సమస్యలు ఉండటం వాటిని త్వరలోనే అధికారులు పరిష్కారిస్తారని తెలిపారు.  పోర్టులో ఎగుమతి దిగుమతి ల్లో పనిచేస్తున్న హమాలీలకు ఇబ్బందులు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.