మంథని: మహిళల భద్రత కోసమే షి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని షీ టీమ్ సభ్యులు అన్నారు. మంగళవారం మంథని పట్టణం లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు భద్రత, ఆన్లైన్ మోసాలపై మరియు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని అన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని ఏఎస్ఐ గాంధీ, షీ టీం సిబ్బంది స్నేహలత, సురేష్, మంథని పోలీసు సిబ్బంది, విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Related Articles
ఆ 45 నిమిషాలు…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని నివాసంలో కేసీ…
ఆ జీవోలు అక్రమమా..? సీఎం జగన్కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూటి ప్రశ్న
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ చేసిన జీవోల ప్రకారమే కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంది. ఈ ప్రాజెక్టులు అక్రమం అంటే.. అప్పుడు జారీ చేసిన జీవోలు అక్రమమా..? అని సీఎం జగన్కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూటి ప్రశ్న వేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి […]
పాతబస్తీలో ఎంఐఎం కోటకు బీటలు
తెలంగాణ ఎన్నికల పలితాల తర్వాత రాజకీయాల్లో కీలక మార్పు…