తెలంగాణ

 నూతన ఇసుక రీచ్ ఆప్రోచ్ రొడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలిసీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలుజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి ప్రతినిధి (సుల్తానాబాద్):  సుల్తానాబాద్ మండలంలో  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, నూతన ఇసుక రీచ్, తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.  మండలంలోని నీరుకుల్లా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం రెగ్యులర్ గా శుభ్రం చేయాలని అన్నారు. గట్టేపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ సూచించారు. సుల్తానాబాద్ పర్యటన సందర్భంగా అవెన్యూ ప్లాంటేషన్ ను కలెక్టర్ పరిశీలించారు. నీరుకుల, గట్టెపల్లి గ్రామాలలో నూతన రోడ్లకు ఇరువైపులా ఎత్తైన మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులకు సూచించారు.సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల, గట్టెపల్లి గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఇసుక రీచ్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇసుక రీచ్ లకు అవసరమైన అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించా లని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సుల్తానాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పెండింగ్ జరిగిన దరఖాస్తుల వివరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలు జిల్లా కలెక్టర్ వెంట సుల్తానాబాద్ తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి,  ఎంపీడీవో దివ్య దర్శన్ రావు పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సచిన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.