కడప, ఆగస్టు 17: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ టెన్షన్ తప్పిపోవడంతో రిలాక్స్ అయిన జగన్ మళ్లీ నవ్వుముఖంతో కనిపిస్తూ.. కూటమి ప్రభుత్వంపై సెటైర్లు మొదలుపెట్టారు. తాము చేసిన మేలు ఇంకా జనాల్లో ఉందంటూ మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతుంది కాని జగన్‌ని పెద్దగా ఎవరూ టార్గెట్ చేయడం లేదు. అసలు వైసీపీని ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదు. వైసీపీ నేతలతో పాటు జగన్ దానిపై ఎక్కడ బెంగపెట్టుకుంటారో అన్నట్లు పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఆ లోటు తీరుస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ఏ ధీమాతో చెప్తున్నారో కాని షర్మిల మాత్రం వైసీపీకి అంత సీన్ లేదని తేల్చేస్తున్నారుషర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైసీపీని, జగన్‌ని చీల్చి చెండాతున్నారు. గత ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. ఓటమి తర్వాత కూడా వైసీపీని విడిచిపెట్టడం లేదు. సోదరుడు జగన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారపక్షంగా కూటమి ఉన్నా విపక్షమైన వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అయితే వైసీపీలో ఆమెను సమర్ధంగా ఎదుర్కోవడం ఎవరి తరం కావడం లేదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేవారు. ఓటమి తరువాత ఆయన సైలెంట్ అయ్యారు.ఇప్పుడు పేర్ని నాని సీన్‌లోకి వస్తున్నా.. షర్మిల దూకుడు ముందు ఆయన తేలిపోతున్నారు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారంట. షర్మిలను కట్టడి చేయకపోతే మొదటికే మోసం వస్తుందని.. వైసీపీని బలోపేతం చేయడం కష్టమని భావిస్తున్నారంట. అందుకే ప్రత్యామ్నాయంగా షర్మిలను ఢీ కొనడానికి తన సతీమణి భారతీ అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కోడలిగా, జగన్ భార్యగా ఆమె ప్రజాక్షేత్రంలో అడుగుపెడితే.. ప్రజలు ఆహ్వానిస్తారని జగన్ భావిస్తున్నారంట.జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సారథ్యంలోని వైసీపీ ఓ పిల్ల కాలువ అని, అది ఎప్పటికైనా మహాసముద్రమైన కాంగ్రెస్‌లో కలవాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారాన్ని ఖండించిన షర్మిల.. వైసీపీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.. గతంలోనే షర్మిల ఈ కామెంట్స్ చేసినా.. తాజాగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనక ఏమైనా మతలబు ఉందా..? అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందనే ప్రచారాన్ని మాత్రమే ఖండించకుండా.. విలీనం అవుతుందనే తరహాలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్‌గా మారాయి. ఇప్పటికే ఏపీలోనూ బలపడాలని, అందుకోసం ఏమేం చేయాలన్న దానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న టైంలో షర్మిల వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ క్రమంలో జగన్ టార్గెట్‌గా దూకుడు పెంచుతున్న షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ నానా తంటాలు పడుతోంది. ఒకరిద్దరు నేతలు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. షర్మిలదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల విమర్శలపై స్వయంగా జగన్ నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు.షర్మిల విషయంలో ఇంకా మెతక వైఖరి అవలభిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని జగన్ భావిస్తున్నారంట. గతంలో మంత్రులుగా పని చేసిన రోజా, విడదల రజిని, తానేటి వనిత, పుష్ప శ్రీవాణితోపాటు మహిళా కమిషన్ చైర్మన్‌గా పని చేసిన వాసిరెడ్డి పద్మ కూడా షర్మిల చేస్తోన్న విమర్శలపై మౌనంగానే ఉంటున్నారు. దీంతో షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు భారతితో పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలని ఆలోచిస్తున్నారంట. మరోవైపు జగన్‌ను పాత కేసులు వెంటాడుతున్నాయి. అక్రమాస్తుల కేసుతోపాటు బాబాయ్ వివేకా హత్య కేసు కూడా ఆయనకు గండంగా మారింది. జగన్ కేసులపై రోజువారి విచారణ చేపట్టాలని కోర్టులు ఆదేశాలు ఇస్తున్నాయి.కేసుల ఉచ్చులో బిగుసుకుపోయిన జగన్ అరెస్టు అయితే పార్టీని నడిపించే నేత అవసరం. అందుకే భారతిని సిద్ధం చేయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల వాయిస్‌ను గట్టిగానే ఎదుర్కొనేందుకు భారతి సరిపోతారని అలాగే తనకు ప్రత్యామ్నాయంగా పార్టీ పగ్గాలు చేపట్టడానికి భారతి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారంట.తల్లి విజయమ్మ జగన్ వైపు వచ్చే అవకాశం లేకపోవడంతో.. భారతిని తెరపైకి తేవడానికే ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో
Related Articles
Balakrishna | రెచ్చిపోయిన బాలయ్య.. వేలు చూపిస్తూ…వార్నింగ్..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email Nandamuri Balakrishna | ఇప్పటివరకూ సహించాం భరించాం..ఎప్పుడైనా ఆవేశం వస్తే చంద్రబాబు ఆలోచించి మమ్మల్ని ఆపేవారు. విర్రవీగి మాట్లాడేవారు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలంటూ బాలకృష్ణ హెచ్చరించారు. ఫ్యామిలీని టచ్ చేసి చూశారు..ఇక ఇంకోసారి..ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. నందమూరి […]
తుంగభద్ర జలాశయానికి వరద
కర్నూలు, ఆగస్టు 12: 69ఏళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఫస్ట్‌టైమ్ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్దిరోజులుగా ఇన్‌ఫ్లో పెరగడంతో క్రస్ట్‌గేట్లను ఎత్తారు అధికారులు. అయితే, రాత్రి 11గం…
షర్మిళ దూకుడుకి కారణం ఎవరు
షర్మిల అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆమె వెనుక…