ఆంధ్రప్రదేశ్ రాజకీయం

లడ్డూలో కల్తీ జరగలేదు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఓవైపు విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ప్రశంసలు కురిపించారు కేంద్ర మాజీమంత్రి చింత మోహన్ కేంద్రమాజీ మంత్రి.. తిరుమల లడ్డూ వివాదంపై విశాఖలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అని ఈ అంశాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని.. నెయ్యి స్థానంలో పామాయిల్ కానీ, వంటనూనె కలిపారన్నారు. తిరుపతి లడ్డూ మీద చంద్రబాబు మాట్లాడకూడదన్నారు.

చంద్రబాబు సూపర్ 6 అన్నారని.. ఇప్పటికీ ఒకటి లేదని విమర్శించారు. ఏపీ అంటే అమరావతి.. పోలవరం అని చంద్రబాబు అంటున్నా రన్నా రు. పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజక్టు అని.. కాళేశ్వరం ప్రాజక్టుపై విచారణ జరిపినట్లు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును రక్షించేది కేవలం చంద్ర బాబు నాయుడు మాత్రమే అని.. ఈ విషయాన్ని ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవా లన్నారు. విశాఖలో ఉక్కు కార్మికులు దీక్షలుమాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయా లని హితవుపలికారు. జగన్ మీద దెబ్బ కొట్టాలంటే బెయిల్ రద్దు అయ్యేలా చూడాలని.. దేవా లయాలను వివాదాల్లోకి తీసుకురావద్దని హితవు పలికారు. మోదీ సర్కార్ ఎప్పుడైనా పడవచ్చ ని.. హర్యానా ఎన్నికల తర్వాత బహుశా జరగవచ్చు అంటూ కేంద్రమాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.