రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉందని చెప్పింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలుపడే ఛాన్స్ ఉందని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.శనివారం నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల వానలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్టూరులో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Related Articles
కాంగ్రెస్ సర్కార్ స్వేత పత్రాలను విడుదల
రాష్ట్రాన్ని పదేళ్లు సుదీర్ఘంగా పాలించిన కల్వకుంట్ల చం…
మారుతి సుజుకి కార్ల ధరల పెంపు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అమలులోకి వచ్చిన కొత్త రేట్లు ప్రముఖ ఆటో మొబైల్స్ సంస్థ మారుతి సుజుకి ఇండియా వివిధ మోడల్స్ ధరలను పెంచేసింది. ఆయా ధరలు 4. 3 శాతం వరకు పెంచినట్టు పేర్కొంది. ముడి పదార్ధాల ఖర్చులు పెరిగిన కారణంగా తమ ఉత్పత్తుల ధరలను పెంచటం జరిగిందని […]
ఇవాళ రాత్రికి దావోస్ కు చేరుకోనున్న సీఎం జగన్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ కు హాజరు కానున్న ముఖ్యమంత్రి బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు అధికారులు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి […]