జాతీయం ముఖ్యాంశాలు

Covid-19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 25వేలకు దిగిరాగా.. తాజాగా 35వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 37,169 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. మరో 440 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.14శాతం ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్‌ కేసులున్నాయని, 148 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది.

ప్రస్తుతం రికవరీ రేటు 97.52 శాతానికి చేరుకుందని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరాయి. ఇందులో మొత్తం 3,14,85,923 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,32,519కు మంది ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా గడిచిన 24 గంటల్లో 55,05,075 డోసులు వేయగా.. ఇప్పటి వరకు 56,06,52,030 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే మొత్తం 49.84 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు తెలిపింది.