నగరంలోని పలుచోట్ల సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్టలో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లల్లోకి, షాపింగ్ కాంప్లెక్సుల్లోకి నీరు చేరింది. రోడ్లపై నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి సంబంధించిన వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన, వీడియోలు