తెలంగాణ

మానవత్వంచాటిన మంత్రి హరీశ్‌రావు

బైక్‌ అదుపు తప్పి చెట్టుకు ఢీకొని రోడ్డుపై పడిఉన్న ఐదుగురు క్షతగాత్రులను 108 వాహనంలో దవాఖానకు తరలించి మానవత్వంచాటుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని ఖాజీపూర్‌కు చెందిన పిట్ల మల్లేశం మంగళవారం దౌల్తాబాద్‌ నుంచి తన కోడలు లావణ్య, ఇద్దరు మనుమళ్లు నవీన్‌(13), కార్తీక్‌, మనుమరాలు శ్రావణితో కలిసి బైక్‌పై ఖాజీపూర్‌కు వస్తున్నాడు. అతివేగం కారణంగా ఖాజీపూర్‌ శివారులో బైక్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొన్నది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాల య్యాయి. ఇదే మార్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు.. వారిని చూసి వాహనాన్ని ఆపారు. వెంటనే 108లో బాధితులను సిద్దిపేట ఏరియా దవాఖానకు తరలించారు. విషమంగా ఉన్న నవీన్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.