కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రలో రోజు రోజుకు విస్తరిస్తున్నది. మంగళవారం ఒకేకేరోజు కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు 103కు చేరాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన వాటిలో గడ్చిరోలి, అమరావతిలో ఆరు చొప్పున, నాగ్‌పూర్‌లో ఐదు, అహ్మద్‌నగర్‌లో నాలుగు, యావత్మల్‌లో మూడు, నాసిక్‌లో రెండు, భాంద్రాలో ఒకటి చొప్పున ఉన్నాయి. కాగా, ముంబైలో 188 నమూనాలను సేకరించగా 128 నమూనాల్లో డెల్టా వేరియంట్ లక్షణాలు ఉన్నాయని, మరో రెండింటలో ఆల్ఫా వేరియంట్ లక్షణాలు ఉన్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది.
మహారాష్ట్రలో 3643 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సఖ్య 64,28,294కు చేరింది. ఇందులో 62,38,794 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది.