తెలంగాణ ముఖ్యాంశాలు

Fire Accident : పటాకులకు నిప్పంటుకొని భారీ అగ్నిప్రమాదం

పటాకులకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో ఈ ఘటన జరిగింది. సారపాకలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉండే ఓ వ్యాపారి భారీగా పటాకులు కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేశాడు. ఇవాళ సాయంత్రం ప్రమాదవశాత్తు పటాకులకు నిప్పంటుకొని పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎస్‌ఐ జితేందర్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పటాకులకు నిప్పంటుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.