రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్‌ఎస్ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్‌ఎస్ జెండాలను ఎగుర వేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని, టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
నల్లగొండలో గుత్తా..
నల్లగొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 48వ వార్డులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ రాష్ట్రంలోని యావత్ పార్టీ శ్రేణులకు, నాయకులకు జెండా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన జరుపుకోవడం శుభపరిణామమన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నడిపిస్తున్న కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్ఠతకు సంస్థాగత నిర్మాణం ఎంతో దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, వార్డ్ కౌన్సిలర్ యామ కవితదయాకర్, సీనియర్ నాయకులు బోయినపల్లి కృష్ణా రెడ్డి, యామ దయాకర్, పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, తూముల రవీందర్ రావు, అనిస్ బాయ్, మనోహర్, హరికృష్ణ, రఘుపతి, కొండూరి సత్యనారాయణ, మధుసూదన రెడ్డి, ఆలయ చైర్మన్ వేణుగోపాల్, వేదాంతం శ్రీనివాస్ చార్యులు,రమేశ్ పాల్గొన్నారు.