జాతీయం తెలంగాణ

ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌.. వేద‌పండితుల‌తో భూమిపూజ‌

రెండు ద‌శాబ్ధాల చ‌రిత్ర క‌లిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించ‌నున్న‌ది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ది. దీని కోసం ఇవాళ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా కాసేప‌టి క్రితం భూదేవ‌త‌కు పూజ‌లు ప్రారంభించారు. ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థ‌లంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ‌లు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో వ‌సంత్ విహార్‌లో సీఎం కేసీఆర్ .. తెలంగాణ భ‌వ‌న్‌కు శంకుస్థాప‌న చేయ‌య‌నున్నారు. పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్విఘ్నంగా కొన‌సాగిస్తున్నారు.

ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌.. వేద‌పండితుల‌తో భూమిపూజ‌