తెలంగాణ ముఖ్యాంశాలు

TS PECET | సెప్టెంబ‌ర్ 30న‌ టీఎస్ పీఈసెట్ 2021 ఎగ్జామ్

తెలంగాణ స్టేట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఎంట్రెన్స్ టెస్టు ( TS PECET ) 2021 ఎగ్జామ్‌ను తేదీని రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఖ‌రారు చేసింది. సెప్టెంబ‌ర్ 30న ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఉన్న‌త విద్యామండ‌లి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సెప్టెంబ‌ర్ 9వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నెల 16 నుంచి సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని పేర్కొంది. త‌దిత‌ర వివ‌రాల కోసం https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.