నగరంలో ప్రతీ ప్రాంతంలో నిలిచిపోయిన వరద నీటిని గంటన్నరలోపు వివిధ మార్గాల ద్వారా మల్లించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రభావితమైన కరీంనగర్ టౌన్, పరిసర లోతట్టు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పర్యటించారు. నడుము లోతు నీటితో నిండిన కాలనీల్లోనూ పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మనగర్, రేకుర్తి, రాంనగర్ తదితర ఏరియాల్లో రోడ్డు పనులు నడుస్తున్నందున నీరు నిలిచిపోయిందన్నారు.
గంటన్నరలో వరద మల్లింపునకు చర్యలు : మంత్రి గంగుల