గత నెల 15న ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ప్రాంతంలో కంటిలో నలుసుగా మారిన యాక్టింగ్ ప్రెసిడెంట్ అమృతుల్లా సాలేహ్‌పై కసి తీర్చుకున్నారు. సాలేహ్ సోదరుడు రోహుల్లా సాలేహ్‌ను మట్టుబెట్టారు. తొలుత పంజ్‌షీర్‌లో తమకు పట్టుబడిన రోహుల్లా సాలేహ్‌ను తొలుత కొరడాలు, విద్యుత్ వైర్లతో తీవ్రంగా కొట్టారు. అటుపై ఆయన గొంతు కోశారు. తర్వాత బుల్లెట్ల వర్షం కురిపించారు. రోహుల్లా సాలేహ్ పంజ్‌షీర్ నుంచి కాబూల్‌కు వెళుతుండగా తాలిబన్లకు చిక్కాడు.
కొన్ని రోజుల క్రితం అమృతుల్లా సాలేహ్ వీడియో విడుదల చేసిన చోటే ఆయన సోదరుడు రోహుల్లా సాలేహ్‌ను తాలిబన్లు చంపేశారు. పంజ్‌షీర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోలేదని అమృతుల్లా సాలేహ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. తన ఆఖరి శ్వాస విడిచే వరకు పంజ్‌షీర్‌లోనే ఉంటానని తేల్చి చెప్పారు.