జాతీయం ముఖ్యాంశాలు

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ గణేశ్‌ చతుర్థి శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

‘కరోనాపై పోరులో గణేశుడు విజయం కలిగించాలని.. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్ చేశారు.

‘ప్రజలందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, అదృష్టం, ఆరోగ్యం కలిగాలని గణేశుని వేడుకుంటున్నా. గణపతి బప్పా మోరియా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.