ఆంధ్రప్రదేశ్

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ఏపీలో పలువురి ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌, ఎక్స్‌ అఫిషియో సెక్రటరీగా గిరిజా శంకర్‌.. పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌గా కోన శశిధర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌గా హరి జవహర్‌లాల్‌, వైద్యారోగ్య శాఖ స్పెషల్‌ సెక్రటరీగా నవీన్‌ నియమితులయ్యారు. ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా శ్యామలరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.