ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 634 కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో అమరావతిలో 48,028 కరోనా టెస్టులు నిర్వహించగా.. 634 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,55,306కు పెరిగింది. కొత్తగా 839 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 20,32,520 మంది కోలుకున్నారు. కొవిడ్‌తో ఎనిమిది మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 14,236కు చేరింది. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 145, తూర్పుగోదావరిలో 84, గుంటూరులో 81 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.