జాతీయం ముఖ్యాంశాలు

భారీ వర్షాలు.. 20 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 20 జిల్లాల్లోని పాఠశాలలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చెంగల్‌పేట, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, రాణిపేట, తిరుచ్చి, అరియలూర్‌, నమక్కల్‌ కడలూర్‌, మైలాడుతురై, వెల్లూరు, కరూర్‌లోని పాఠశాలలో మూసివేశారు. ఆదివారం నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షాల కారణంగా తొమ్మిది జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

అలాగే దీపావళితో పాటు 5వ తేదీన సైతం అదనంగా సెలవులు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వేలూరు, రాణిపేట్, విల్లుపురం, కడలూరు, పుదుక్కోట్టై, రామనాథపురం, తిరునల్వేలి, తూత్తుకుడి, డెల్టా జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.