(Kanna Coments) బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ గ్రాండ్ విక్టరీ నమోదు చేయగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది. అయితే, ఓటింగ్ మాత్రం గణనీయంగా పెరిగిందంటూ బీజేపీ నేతలు సంతోసం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. తాము ఓడిపోయినప్పటికీ ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకోగలిగామని చెప్పారు.. బద్వేల్ ఉప ఎన్నిక బీజేపీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నిక ఫలితంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.
సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలో.. అధికార పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరించారని, బద్వేల్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. ఈ ఎన్నికలో నైతిక విజయం తమ పార్టీదేనన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. 2024 ఎన్నికల నాటికి బీజేపీ ప్రధాన పార్టీగా అవతరిస్తుందనే నమ్మకం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.