అంతర్జాతీయం

టెక్‌ దిగ్గజాలపై చైనా జరిమానా

చైనీస్‌ దిగ్గజ టెక్‌ సంస్థలపై ఆ దేశ పాలక కమ్యూనిస్టు పార్టీ కొరడా ఝుళిపిసున్నది. అలీబాబా గ్రూపు, టెన్సెంట్‌ హోల్డింగ్‌ సంస్థలపై శనివారం లక్షల డాలర్ల మేర జరిమానా వేసింది. ఎనిమిదేండ్ల క్రితం వరకు జరిగిన 43 ఇతర సంస్థల కొనుగోళ్ల (టేకోవర్‌) వివరాలు ఆయా కంపెనీలు ఇవ్వలేదని ‘స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ మార్కెట్‌ రెగ్యులేషన్‌’ పేర్కొన్నది. ఇందుకు గానూ ప్రతి ఉల్లంఘనకు 5 లక్షల యువాన్లు (80 వేల డాలర్లు) జరిమానా వేస్తున్నట్లు వెల్లడించింది.