పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాల పాటు శీతాకాల సభా సమయం వృధా అయినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయినా కీలకమైన బిల్లుల గురించి చర్చ జరిగిందన్నారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో ఒమిక్రాన్, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరిగినట్లు ఓం బిర్లా తెలిపారు. మరో వైపు రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేశారు.
చైర్మెన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. శీతాకాల సమావేశాలు అంచనాలకు తగిన రీతిలో జరగలేదన్నారు. నిజానికి ఈ సమావేశాలు మరింత బాగా జరగాల్సి ఉందని, ఎక్కడ తప్పు జరిగిందో సభ్యులో ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. సభ్యులకు క్రిస్మస్, న్యూఇయర్ గ్రీటింగ్స్‌ను తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి డిసెంబర్ 23వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే సమావేశాలను నిరవధిక వాయిదా వేశారు.