జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – బిజెపిల జర్నీ గత కొన్నేళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నిత్యం సోషల్ మీడియా లో , పలు సభ వేదికల ఫై బిజెపి ఫై ప్రశంసలు చేస్తూ వస్తుంటారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ను బిజెపి అవమానించిందా..అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రధాని మోడీ రేపు (జులై 04) న భీమవరంలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ప్రధానమంత్రికి పరిచయం చేసి సత్కరించే కార్యక్రమాన్ని క్షత్రియ పరిషత్ చేపట్టింది. ఈ మేరకు క్షత్రియ పరిషత్ నర్సీపట్నం సభ్యులు డీవీఎస్ రాజు అల్లూరి జిల్లా నడుంపాలెం లంకవీధి జీడితోటల్లో ఉంటున్న గంటం దొర మనువడు బోడి దొర కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వానించారు.
రేపు గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు గవర్నర్ విశ్వ భూషణ్, సీఎం జగన్. గన్నవరం నుండి భీమవరంకు ఒకే హెలికాప్టర్లో ప్రయాణం చేయనున్నారు ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి జగన్. అలాగే… ప్రధాని మోడీ కాకుండా వేదిక పై ఎనిమిది మందికి చోటు కల్పించింది బీజేపీ. గవర్నర్ విశ్వ భూషణ్, సీఎం జగన్. కిషన్ రెడ్డి, చిరంజీవి, పురంధరేశ్వరి, సోము వీర్రాజు, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ, వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు, మంతెన వెంకట రామరాజు, పేరిచర్ల రాజు ప్రధానితో పాటు వేదిక పంచుకోనున్నారు. టీడీపీ నుంచి ప్రధాని బహిరంగ సభ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు హాజరు కానున్నారు. ఈ సభకు కానీ ఈ కార్య క్రమానికి కానీ జనసేనకు సంబదించిన ఎవర్ని కూడా ఆహ్వానించకపోవడంఫై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి మా అధినేత సపోర్ట్ చేస్తూ వచ్చినప్పటికీ , పవన్ కు ఆహ్వానం అందించకపోవడం ఫై వారంతా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.