roja
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బాలకృష్ణ చిల్లర చేష్టలు!

బాబును చూసి పాపం అనేవారు లేరు.. పాపాలు పండాయ్ అంటున్నారు!   స్కిల్ స్కాంపై చర్చ అనగానే బాలకృష్ణ తోకముడిచి పారిపోయాడు.  బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి బాలకృష్ణ మనస్సాక్షి ఒప్పుకోలేదా?   చేసిన తప్పులకు చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.  సమావేశాలు ముగిసే లోపు బాబు స్కాములపై చర్చకు రండని మంత్రి రోజా అన్నారు.
తొడకొట్టిన బాలయ్య తోకముడిచి పారిపోయాడు. రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే టీడీపీ చర్చ కోసం వచ్చిందా…రచ్చ కోసం వచ్చిందా అనేది ప్రజలకు అర్ధమై ఉంటుంది. చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి చేశాడు.  నిన్న తొడకొట్టిన బాలకృష్ణ ఈ రోజు స్కిల్ స్కాంపై చర్చించకుండా తోకముడిచి ఎందుకు పారిపోయాడు..?  సం తిప్పిన బాలకృష్ణ ఈ రోజు అజెండాలో స్కిల్ కేసుపై చర్చ ఉండటంతో పారిపోయారెందుకు..రోషం లేదా? మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదా? అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక బాబుపై కేసు కొట్టేయాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని అరిచాడు.  చంద్రబాబు సీటు మీద మనసు పడ్డాడో ఏమో ఆ సీటెక్కి కూర్చోలేక, నిల్చోలేక చిల్లర చేష్టలు చేశాడని అన్నారు.
అలా దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు అందిస్తాను నన్ను క్షమించండి అని ప్రజల కాళ్లావేళ్లా పడి చంద్రబాబు క్షమాపణలు కోరాలి.  అసెంబ్లీలో స్కిల్ స్కాంపై చర్చ పెట్టగానే బాయ్కాట్ చేసి వెళ్లిపోయారని అన్నారు.
నేను టీడీపీ వారిని సూటిగా అడుగుతున్నాను. మీకు మాట్లాడే దమ్ము ధైర్యం లేదా..? లేక ఆ స్కాంలో మీకు కూడా వాటాలున్నాయా?  బాలకృష్ణ సినిమాల్లోనే డైలాగులు చెప్తాడా..అసెంబ్లీలో చెప్పడం రాదా? స్కాం నిజమా కాదా అని చెప్పే అవకాశం వచ్చినప్పుడు బాలకృష్ణ చర్చించకుండా పారిపోయాడు అంటే అర్ధం ఏమిటి? మేం సవాల్ చేస్తున్నాం..రానున్న సోమ, మంగళ, బుధ వారాల్లో ఎప్పుడైనా చర్చకు మేం సిద్ధం.  స్కిల్ స్కాం ఒక్కటే కాదు…ఫైబర్ గ్రిడ్, తాత్కాలిక సచివాలయం వంటి అన్ని స్కాంలపై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.  సినిమాల్లో డైరెక్టర్, రైటర్ రాసిచ్చినవి చెప్పడం కాదు బాలకృష్ణ గారూ.. దమ్ముంటే నా బావ తప్పుచేయలేదని అసెంబ్లీకి వచ్చి చెప్పండి.  కావాలంటే ఈడీ, సీబీఐ విచారణలు వేసుకోండని చెప్పాలి కానీ, పారిపోవడం సరికాదు.  ఈ రోజు బాలకృష్ణ పారిపోయారంటే మీ బావ తప్పు చేసినట్లు మీరే ఒప్పుకున్నట్లయింది.
లోకేశ్ ఢిల్లీ వెళ్లి బహిరంగ చర్చకు వస్తారా అని అడుగుతున్నాడు. ఎలాగూ లోకేశ్ అసెంబ్లీకి రాలేడు..ఎందుకంటే ఏ ఎన్నికలోనూ ఆయన గెలవలేదు కాబట్టి.  సభలో ఎమ్మెల్యేగా మీ మామ బాలకృష్ణ ఉన్నాడు కదా..చర్చకు రమ్మనండి.  మేం రెడీగా ఉన్నాం.. మీ మామను, ఎమ్మెల్యేలను రమ్మనండి తేల్చుకుందామని అన్నారు.
బాబు దోపిడీ చూసి ప్రజలు విస్తుపోతున్నారు:. చంద్రబాబు ఇన్నేళ్లు చాలా తెలివిగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ దోచుకున్నాడు.  ఇప్పుడు సాక్షాధారాలతో దొరికిపోయాడు…ఇక టీడీపీ పరిస్థితి ఏంటి అనేది తెలియక టీడీపీ ఎమ్మెల్యేలు పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు.  సభలో వారి ప్రవర్తన చూసి వారికి ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు.
టీడీపీ వారు సమస్యలపై చర్చించడం కాదు…వారే మనకు సమస్యై కూర్చున్నారని ప్రజలు అనుకుంటున్నారు.  అనుభవం ఉంది కదా అని ఈ తెలుగు దొంగల పార్టీకి అధికారం ఇస్తే ఎలా దోచుకున్నారో చూసి ప్రజలు విస్తుపోతున్నారు.  చంద్రబాబు అరెస్ట్ను చూసి ప్రజలు ఎవరూ  పాపం అని అనడం లేదు. చంద్రబాబు పాపాలు  టడిపోయాయి..అని అంటున్నారు. ఇక బాబు తప్పించుకునే  పరిస్థితి లేదు.  ఇక మీదట జగన్ ని అనవసరంగా ఎవరైనా మాట్లాడితే వదిలిపెట్టేది లేదని రోజా అన్నారు.