విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి గతేడాది ఇతర దేశాలతోపాటు మనదేశం లాక్‌డౌన్ విధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గింది.. తదనుగుణంగా ఉత్పత్తి తగ్గడంతో ధర పడిపోయింది.
కానీ కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు పెంచేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు ఎంత జమ అయ్యిందో తెలుసా.. అక్షరాల రూ.4.51 లక్షల కోట్లు. 2019-20తో పోలిస్తే 56.5 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.
పరోక్షంగా వచ్చిన పన్నులు 56.5 శాతం పెరిగి రూ.4.51 లక్షల కోట్లకు చేరాయని ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది.
మొత్తం రూ.4.51 లక్షల కోట్లలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతితో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.4.13 లక్షలు, కస్టమ్స్ డ్యూటీ రూ.37,806.96 కోట్లు
మధ్యప్రదేశ్‌లోని నీమూచ్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే ఆర్టీఐ కార్యకర్త పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిపై వచ్చిన ఎక్సైజ్, కస్టమ్స్ సుంకం వివరాలు వల్లడించాలని కోరారు.
2019-20లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిపై కస్టమ్స్ సుంకం రూ.46 వేల కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.2.42 లక్షల కోట్లు. మొత్తం రూ.2.88 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది.
ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నదని జయంతిలాల్ భండారీ అనే ఆర్థిక వేత్త చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సగటు పౌరుడిపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.