డిసెంబర్ నెల వచ్చేస్తోంది. ప్రతినెల ఒకటో తేదీన కొన్ని కీలక మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో, వివిధ రకాల నిబంధనలు మారుతుంటాయి. మరి డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎలాంటి నిబంధనలు అందుబాటులోకి రానున్నాయో తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు: నెల మొదటి రోజు గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది. గత కొన్నేళ్లుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. కానీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు నిరంతరంగా కనిపిస్తున్నాయి. ఈ మార్పు నవంబర్ నెలలో రెండుసార్లు కనిపించింది. మొదటి తేదీన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచారు. ఆ తర్వాత ధర రూ.2000కి పడిపోయింది. ఆ తర్వాత ధరలు తగ్గాయి. ఈసారి గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలలో కొంత మార్పు ఉండవచ్చు.
లైఫ్ సర్టిఫికేట్: మీరు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, పెన్షన్ పొందుతున్నట్లయితే ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించేందుకు నవంబర్ 30తో గడువు ముగియనుంది. ఈ నెలాఖరులోపు మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా సమర్పించండి. మీరు దీన్ని చేయకపోతే, తదుపరి పెన్షన్ రావడం ఆగిపోవచ్చు. కొత్త సిమ్ కార్డు జారీపై కొత్త రూల్స్ డిసెంబర్ 1 నుంచి టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఈ కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేవైసీ లేకుండా ఏ దుకాణదారుడు సిమ్ కార్డులను విక్రయించలేడు. అంతేకాకుండా పెద్ద ఎత్తున సిమ్ కార్డులను తీసుకునేందుకు అవకాశం లేదు. నకిలీ సిమ్ కార్డుల వల్ల జరిగే మోసాలను అరికట్టేందుకు వీలుగా డిపార్ట్‌మెంట్ ఈ విధంగా చేసింది. ఎవరైనా ఈ నిబంధనను పాటించకుంటే రూ.10 లక్షల జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు దారులూ క్యూ కట్టండి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో మార్పులు ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ వినియోగం బాగా పెరిగింది.
అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులపై వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మరోవైపు, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దాని రిగలియా క్రెడిట్ కార్డ్‌లో అందుబాటులో ఉన్న లాంజ్ యాక్సిస్ ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. ఈ మార్పు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పుడు రెగాలియా క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ సౌకర్యం కోసం ప్రతి మూడు నెలలకు రూ. 1 లక్ష క్రెడిట్‌ని ఉపయోగించడం తప్పనిసరి. ఈ వ్యయ ప్రమాణాలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే కార్డ్ హోల్డర్ ఈ సదుపాయాన్ని పొందగలుగుతారు. డిసెంబర్ 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన మరో మార్పు అమలు చేయనుంది ఆర్బీఐ. బ్యాంకు రుణం తీసుకుంటే వినియోగదారునికి సంబంధించిన ఇంటి పత్రాలు గానీ ఇతర పత్రాలు గ్యారంటిగా తీసుకుంటుంది. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత ఆ పత్రాలను 30 రోజుల్లోపు బ్యాంకు తిరిగి ఇచ్చేయాలి. అలా ఇవ్వని పక్షంలో బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధిస్తుంది. ఈ జరిమానాను నెలకు రూ.5 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
పెరిగితే మాత్రం మామూలుగా ఉండదు ఉచిత ఆధార్ అప్‌డేట్ కోసం చివరి తేదీ: ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్ గడువును పొడిగించింది కేంద్రం. మీరు గత 10 సంవత్సరాలలో మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయకుంటే,మీరు డిసెంబర్ 14 వరకు దీన్ని ఉచితంగా చేయవచ్చు. ఆధార్ సంబంధిత మోసాలను నిరోధించడానికి 10 ఏళ్ల ఆధార్ ఉన్నవారిని తాజా సమాచారంతో వివరాలను అప్డేట్ చేయాలని యూఐడీయేఐ కోరుతోంది. యూపిఐ ఐడీల డీయాక్టివేట్: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గూగుల్ పే, పేటీం, ఫోన్ పే మొదలైన చెల్లింపు యాప్లను, బ్యాంకులను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు యాక్టివ్గా లేని యూపిఐ ఐడీల నంబర్లను డీయాక్టివేట్ చేయమని కోరింది. నవంబర్ 7, 2023న యూపిఐ సభ్యులందరికీ ఎన్సీపిఐ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 1 వరకు యూపీఐ ఐడీలను యాక్టివ్ చేసుకోవాలి. లేకుంటే డీయాక్టివేట్ అవుతాయి.