tel-schols
తెలంగాణ ముఖ్యాంశాలు

15 నుంచి హాఫ్ డే స్కూల్స్

తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉద‌యం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వ‌ర‌కు బ‌డులు నిర్వహిస్తారు.  ఈ మేరకు పాఠశాలలకు ఒంటిపూట బ‌డుల‌పై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ మూడోవారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యా హ్నం 12.30 గంటలకు అందజేస్తారు. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
అలాగే.. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.

పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా విద్యాశాఖ హాఫ్ డేస్ ప్రకటించింది. మార్చి  15 నుంచి  ఈ విద్యా సంవత్సవంలో చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు అంటే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొంది.