ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఆగస్ట్ 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్ట్ 1న, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరుకావాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది. చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఎదుట నరేగా నిధులపై విచారణ చేపట్టారు. వివిధ పిటిషన్లను కలిపి హైకోర్టు ధర్మాసనం విచారించింది. సీఎస్ ఆథిత్యనాథ్‌ను కూడా పిలిపించాలని హైకోర్టు తొలుత భావించింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సుమారు 2,500 కోట్ల నరేగా నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Related Articles
ఆరోపణలు ఉన్నవారికే వీసీ పదవులు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు గడుస…
అనర్హత వేటు వేయించేందుకు ఫిబ్రవరి 5 వరకు సమయం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోండి… తక్షణమే రాజీనామా చేస్తా: రఘురామ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పార్లమెంటులో అనర్హత వేటు వేయించాలని వైస్సార్సీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుండడం తెలిసిందే. దీనిపై రఘురామ స్పందించారు. నాపై అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోండి… ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేస్తాను అంటూ సవాల్ […]
పీపీపీ మోడల్ లో అభివృద్ది పనులు
తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పబ్లిక్,ప్రైవేటు పా…