మేడిన్ ఇండియాలో భాగంగా నిర్మించిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మార్క్ 1ఏ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇవాళ తొలిసారి గగనవీధుల్లో ఎగిరింది. మార్క్ 1ఏ ఫైటర్ విమానం పరీక్ష బెంగుళూరులో విజయవంతంగా ముగిసినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. తన తొలి ఫ్లయిట్‌లో ఆ విమానం సుమారు 15 నిమిషాల పాటు గగనవీధిలో విహరించినట్లు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ అధికారులు చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మార్క్ 1ఏ ఫైటర్ విమానం భారతీయ చరిత్రలో కొత్త మైలురాయిని లిఖించింది. ఆ విమానం 1.15 నిమిషాలకు టేకాఫ్ తీసుకున్నది. 1.33 నిమిషాలకు అది ల్యాండ్ అయ్యింది. చీఫ్ టెస్ట్ పైలెట్ కేకే వేణుగోపాల్ ఆ ఫైటర్ విమానాన్ని నడిపారు.