హైదరాబాద్, జూలై 30: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు మరో భారం పడనుంది. ఫూట్‌వేర్ సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలు తీసుకొస్తోంది కేంద్రం. దీంతో చెప్పులు, షూల ధరలు భారీగా పెరగనున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి కొత్త నాణ్యతా ప్రమాణాలు అమలులోకి రానున్నాయి. అంటే అప్పటి నుంచి తయారయ్యే షూ, స్లిప్పర్లు, సాండిల్స్ కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ స్పష్టం చేసింది.కొత్త నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం.. చెప్పులు, షూ తయారు చేసే వారు IS 6721, IS 10702 నిబంధనలు కచ్చితంగా పాటించాలని బీఐఎస్ స్పష్టం చేసింది. చెప్పులు, షూ తయారీలో ఉపయోగించే రెగ్జిన్, ఇన్‌సోల్ వంటి ముడి పదార్థాలకు రసాయన పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. అలాగే చెప్పులు, షూల బయటి భాగాలకు వినియోగించే మెటీరియల్ చిరగకుండా, ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చూసుకోవాలి. అలాగే టెస్టింగ్ లో ఆ మెటీరియల్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఇష్టారీతిలో నాణ్యతలేని చెప్పులు, షూ తయారు చేయడం కుదరదు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఎక్కువ కాలం మన్నికయ్యే చెప్పులు, షూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు బీఐఎస్ వర్గాలు తెలిపాయి.అయితే, కొత్త ప్రమాణాల ప్రకారం చెప్పుల తయారీ ఖర్చులు పెరగనున్నాయి. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు ధరలు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, రూ.50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంెపనీలకు ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం. పాత స్టాక్‌కి సైతం ఈ రూల్స్ వర్తించవని, ఆగస్టు 1 తర్వాత తయారయ్యే వాటికే ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. అయితే, విక్రయదారులు తమ వద్ద ఉన్న పాత స్టాక్ వివరాలను బీఐఎస్ వెబ్‌సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది.నాణ్యమైన వస్తువులు పొందడం కొనుగోలుదారుడి హక్కు అని బీఐఎస్ చెబుతోంది. వివిధ వస్తువులు, ఉత్పత్తులు, పరికరాలు బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాలి. దేశ దాదాపు 344 వస్తువులకు బీఐఎస్ నాణ్యత గుర్తు కచ్చితంగా ఉండాలి. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఫోన్లు సహా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులకు బీఐఎస్ సింబల్ కచ్చితంగా ఉండాలి. సుమారు 20 వేల ప్రమాణాలను బీఐఎస్ ధ్రువీకరించి అందుబాటులోకి తీసుకొచ్చింది.
Related Articles
టీ పీసీసీలో ఎస్సీ చిచ్చు రేపిన రేవంత్
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో మరో…
బ్యాక్ టూ గవర్నర్....
గవర్నర్ అమోదం లభించని బిల్లుల విషయంలో ముందుకే వెళ్లాలని త…
VRR Enclave మరియు బృందావనం కాలనీ లో ప్రతి గడప గడపకి కీ ప్రభుత్వం
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డు లో గల…