తుగ్గలి: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తుగ్గలి మండల తహసిల్దార్ గా షర్మిల బాధ్యతలు చేపట్టి మండల వ్యాప్తంగా మండల అధికారుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు.ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల విధులను నిర్వహించిన అధికారులు ఎన్నికల ముందు విధులు నిర్వహించిన మండలాలకు బదిలీ కావాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు బదిలీలు అవుతున్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రమైన తుగ్గలిలోని తహసిల్దార్ షర్మిల మంగళవారం రోజున జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా తుగ్గలి మండల రెవెన్యూ సిబ్బంది,సచివాలయ సిబ్బంది,విలేజ్ సర్వేయర్లు,వీఆర్ఏలు మరియు డీలర్లు తహసిల్దార్ షర్మిలకు ఘనంగా శాలువాతో సన్మానించి పూలమాలలు వేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ తహసిల్దార్ షర్మిల ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించారని,అదేవిధంగా మండలంలోని గల భూ సమస్యలను పరిష్కరించడం కొరకు ఎంతో కృషి చేశారని వారు తెలియజేశారు.రైతుల సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేసేవారని వారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగరాజు,ఆర్ఐ సుధాకర్ రెడ్డి,మండల సర్వేయర్ గాదిలింగప్ప,మండల విఆర్వోలు,మండల విలేజ్ సర్వేయర్లు, మండల వీఆర్ఏ లు,మండల డీలర్లు మరియు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related Articles
ఏపీలో హైవోల్టేజ్ పాలిటిక్స్…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ ఊహించనంత హైవో…
చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయం
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ రక్షణ అధికారంలోకి వ…
అమరావతి ఆవేదనకు సొల్యూషన్ దొరికినట్టేనా ప్రతి జిల్లాలో ఓ అట్రాక్షన్
అమరావతి ఆవేదన పేరిట.. తాడికొండ నియోజకవర్గం రావెల…