ఆంధ్రప్రదేశ్

కంది పంటలో వేరుకుళ్ళు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి...ఏవో రవి

మద్దికేర: ప్రస్తుత పరిస్థితులలో కంది పంటలో వ్యాప్తి చెందుతున్న వేరుకుళ్ళు రైతులు అప్రమత్తంగా ఉండాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు. సోమవారం రోజున మండల వ్యవసాయ అధికారి రవి యడవలి రేవన్యూ గ్రామానికి సంబందించిన రైతుల పొలాలలో కంది పంటను పరిశీలించారు.రైతు పొలంలో వేరుకుళ్ళు తెగులు గమనించడడం జరిగిందనీ,దీనివల్ల కంది పంటలో ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి నెమదిగా పూర్తిగా పసుపు రంగులోకి మారి,మొక్కలోని కాండం కుళ్ళి పోయి, మొక్కలు పూర్తిగా వాడిపోయి చనిపోవటం గమనించటం జరిగిందని ఆయన తెలియజేశారు. దీని నివారణకు తక్షణమే లీటర్ నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ (బ్లైటాక్స్ ) మరియు ప్లాంటో మైసిన్ 0.2 గ్రాములు కలిపి మొక్కల కాండం బాగా తడిచే విదంగా పిచికారీ చేయవలసినదిగా రైతులకు తెలియజేశారు. ఈ మందును పిచికారి చేయడం వలన కంది పంటలో వేరు కుళ్ళును నివారించవచ్చని మండల వ్యవసాయ అధికారి రవి రైతులకు తెలియజేశారు.