మంథని: విధుల్లో చేరిన నాటి నుండి సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే ప్రతి ఉద్యోగి కి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని,పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని మంథని ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ అన్నారు. టిజిఎస్ ఆర్టిసి లో అసిస్టెంట్ డిపో క్లర్కుగా పనిచేస్తున్న ముద్దసాని లక్ష్మీనారాయణ (ఎమ్మెల్ నారాయణ) బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు ఎమ్మెల్ నారాయణ దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంథని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో బస్సు డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ టీజీఎస్ఆర్టిసిలో గత 34 ఏళ్లుగా డ్రైవర్ గా ఇలాంటి మచ్చ లేకుండా పనిచేసి ఏడీసీగా పదోన్నతి పొంది మంథని డిపోలోనే పనిచేస్తూ ఎమ్మెల్ నారాయణ అందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఎంతో పని ఒత్తిడీతో విధులు నిర్వర్తించిన ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం గొప్ప విషయం అని అన్నారు. తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్దతో పనిచేశా రని, తోటి సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించారన్నారు. ప్రజలను సురక్షితంగా గమ్యాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక పనిచేస్తారని ఆయన అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఏంజెల్, సూపర్డెంట్ ప్రసన్న కుమార్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఎల్ హెచ్ శ్రీనివాస్, విటిపిఐఎస్ దండే సదానందం, ఏడీసీలు డిఎస్ రావు, ఎస్ రాజేందర్, ఎస్డీఐ గోపాల్, కార్మికులు కేకే రెడ్డి,వేల్పుల వెంకటస్వామి, దుబ్బాక దేవేందర్, ఎస్ ఎస్ నారాయణ, ఈసంపల్లి మల్లయ్య, పందాల కుమార్, గుర్రాల కృష్ణ, ఈ రవికుమార్, ఆర్ మోండయ్య, ఈ శ్రీనివాసు లతోపాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Related Articles
స్పీకర్ చేతిలో గులాబీ నేతల భవితవ్యం
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో అం…
అమ్మకానికి మెట్రో…
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తట్టు…
మోడీ హయంలో ఉగ్రవాదం అంతమయింది
రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని గగన్ పహాడ్ వద్ద చేవె…