తెలంగాణ

జూలై నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన జీ.ఎం.లు

కమాన్ పూర్: రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జిఎం కార్యాలయంలో జూలై నెలలో ఉత్పత్తి అయిన బొగ్గు వివరాలను జిఎంలు సుధాకర్ రావు వెంకటేశ్వర్లు తెలియజేశారు. జూలై నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఆర్.జి-3 జనరల్ మేనేజర్ శ్రీ ఎన్.సుధాకర రావు ఎ.పి.ఎ జీ.ఎం  కె.వెంకటేశ్వర్లు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆర్.జి-3 జి.ఎం  ఎన్.సుధాకర రావు మాట్లాడుతూ జూలై నెలలో ఆర్.జి-3 ఏరియాకు నిర్దేశించిన 4.19 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 4.08 లక్షల టన్నులు అనగా 97 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, నిర్దేశించిన 38.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి(మట్టి)వెలికితీత లక్ష్యానికి గాను 21.80 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 57 శాతం ఓ.బి(మట్టి) వెలికి తీయడం జరిగిందని, అదేవిధంగా 5.83 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. ఎ.పి.ఎ. జి.ఎం  కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాకు జూలై నెలకు నిర్దేశించిన 0.18 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.52 లక్షల టన్నులు అనగా 292 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, 0.59 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. ఉద్యోగులందరూ  బాధ్యతాయుతంగా పనిచేస్తూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రత తో సాధించడానికి కృషి చేయాలన్నారు.