తెలంగాణ

సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం.. సీఎంవోలో సెక్ర‌ట‌రీగా రాహుల్ బొజ్జా!

ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభోత్స‌వ వేదిక‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఎస్సీ సంక్షేమ‌ శాఖ సెక్ర‌ట‌రీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవోలో సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాహుల్ బొజ్జా ద‌ళితుడే. వాళ్ల నాన్న‌ బొజ్జా తార‌కం.. ఉద్య‌మంలో ప‌ని చేసిన వారికి న్యాయవాదిగా ఉండే. గొప్ప న్యాయ‌వాది. ఆయ‌న కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్ర‌ట‌రీగా ఉండ‌ట‌మే కాదు.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోనే సెక్ర‌ట‌రీగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. ఆయ‌న ఆదేశాల‌న్నీ అమ‌లు కావాలె. రేప‌ట్నుంచి నా కార్యాల‌యంలో సెక్ర‌ట‌రీగా ఉంటారు అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.