భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం వరకు గోదావరి నీటిమట్టం 37 ఫీట్లకు చేరింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి నేటి మధ్యాహ్నం వరకు నీటిమట్టం 2.5 ఫీట్ల మేర పెరిగింది. గోదావరి నీటిమట్టం పెరుగుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
దుమ్ముగూడెం మండలంలోని సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పర్ణశాల వద్ద నారచిరాల ప్రాంతం ముంపునకు గురైంది. ఇదిలా ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి. సింగరేణి, కామేపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొత్తగూడెంలో 24 గంటల్లో 5.1 మి.మీ. వర్షపాతం నమోదు అయింది.