జాతీయం

వన్‌ సన్‌, వన్‌ వరల్డ్‌, వన్‌ గ్రిడ్‌

  • గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన

సౌరశక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ, కరెంట్‌ కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయడమే లక్ష్యంగా ‘వన్‌ సన్‌, వన్‌ వరల్డ్‌, వన్‌ గ్రిడ్‌’ ప్రాజెక్టును భారత్‌ ఆవిష్కరించింది. ఈ మేరకు గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌26 ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ వెల్లడించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని పరిమితం చేస్తూ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. సౌర ప్రాజెక్టులు ఏయే ప్రాంతాల్లో నిర్మించాలన్న విషయాలను తెలియజేసే ‘సోలార్‌ కాలిక్యులేటర్‌’ యాప్‌ను ఇస్రో త్వరలో తీసుకురానున్నట్టు తెలిపారు. అన్ని దేశాలు ఈ యాప్‌ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు.