తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై బద్వేల్ లో చేపట్టిన ఆందోళన ఇప్పటికీ కొనసాగుతుంది శుక్రవారం బద్వేల్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రిలే దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబుకు తోడుగా నియంత పై నిరంతర పోరాటం చేస్తున్నామని తెలిపారు వైకాపా ప్రభుత్వ తీరును ఎండ కొడుతూ వారు మాట్లాడారు చంద్రబాబు ఏమి తప్పు చేశారని జైల్లో పెట్టారని బద్వేలు తెలుగుదేశం పార్టీ గ్రామీణ అధ్యక్షుడు రవి కుమార్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఫాలోయింగ్ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్ర చేసినట్లు ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో వైకాపా పతనం ఖాయమని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని కుయుక్తులు కుట్రలు పన్నిన వైకాపా పతనం ఖాయమని అన్నారు గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా బాబాయ్ హత్య సానుభూతితో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా దిగజారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా ప్రజల్లో ఎలాంటి సానుభూతి లేదన్నారు కేవలం రాజకీయంగా దిగజారి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బ్రష్టు పట్టించారని ఆరోపించారు
దేశంలో ఇలాంటి అవినీతి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేడన్నారు 43 వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సుద్దులు చెబుతున్నానని ఆరోపించారు చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత కక్ష తోనే కుట్ర చేసి ఆయనను జైలు పాలు చేశారని ఆరోపించారు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తద్యమన్నారు ఇంకా పలు విషయాల గురించి ఆయన మాట్లాడారు కడప పార్లమెంట్ తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు ఆదిలక్ష్మి నాయకులు రామచంద్రారెడ్డి నరసింహనాయుడు బైసాని రవి శంకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు కెపిఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అలాగే పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు